18 March, 2026 | 6:32 PM

స్వామి వారికి నిత్యాభిషేకం, హోమములు

18-03-2026 05:02 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం, మట్టపల్లి మహాక్షేత్రం నందు బుధవారం శ్రీ స్వామి వారికి ప్రాతఃకాలమున నిత్యాభిషేకములు, నిత్య హోమములు జరిగాయి. తదుపరినిత్య కళ్యాణం దేవాలయ అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, ఫణి భూషణ మంగాచార్యులు, పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి, ఆంజనేయ చార్యులు వార్లచే శాస్త్రోతముగా  నిర్వహించబడినది. దేవాలయం అన్నదానంలో  110 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగినది.