సంక్షేమంలో ‘సీపీఎస్’
జవాబుదారీతనం పెంచేందుకే సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానం..
- విద్యార్థులకు సకాలంలో పాఠ్య సామగ్రి అందాలి
- వస్తువుల నాణ్యత విషయంలో రాజీపడొద్దు
- ప్రతి విద్యార్థి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి
- సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): విద్యాశాఖతోపాటు బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలు, ఎస్సీ డెవలప్‌మెంట్ శాఖల పరిధిలోని విద్యా సంస్థల్లోని విద్యార్థులకు సామగ్రిని అందజేసేందుకు సెంట్రలైజ్డ్ ప్రొ క్యూర్‌మెంట్ సిస్టమ్(సీపీఎస్)ను అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. అప్పుడే విద్యార్థులకు అవస రమైన సామగ్రి అంతా సకాలంలో అందినప్పుడే వారు చదువుపై పూర్తిస్థాయిలో శ్రద్ధ చూపుతారని తెలిపారు.
ఆయా ప్రభుత్వ సం క్షేమ శాఖలు, విద్యాసంస్థల్లోని విద్యార్థులకు అందజేసే సామగ్రి సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానంపై సీఎం రేవంత్ రెడ్డి గురు వారం సమీక్ష నిర్వహించారు. గతంలో ఏ శాఖకు ఆ శాఖ ప్రొక్యూర్మెంట్, సరఫరా చేపట్టడంతో ఏకరూపత లోపించడంతో పాటు అనేక అక్రమాలు చోటుచేసుకునేవని, వాటిని అరికట్టేందుకు సీపీఎస్ విధానాన్ని తీసుకువచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
గతంలో దుస్తులు, నోటు పుస్తకాలు, ట్రంక్ పెట్టెలు, ఇతర సామగ్రి సరఫరాకు సంబంధించి ఏ శాఖకు ఆ శాఖ చేపట్టడంతో అవక తవకలకు ఆస్కారం ఉండేదన్నారు. అటువంటి అవకతవకలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానంతో జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. విద్యార్థులకు అందజేసే నోటు పుస్తకాలు, ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసు లు, ట్రాక్ షూట్లు, బెడ్ షీట్లు, స్కూల్ బ్యాగ్ లు, ఐడీ కార్డులు, యూనిఫాంలు అన్నీ నాణ్యమైనవే ఉండాలని అధికారులను ఆదేశించారు.
నాణ్యతతో పాటు సకాలంలో అంద డంపైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. జూన్ 15 నాటికి విద్యార్థులకు అవసరమైన సామగ్రి అంతా అందాలని, అలా అందగానే సరఫరాదారులకు చెల్లింపులు పూర్తి చేస్తామని తెలిపారు. విద్యార్థులకు అందజేసే వస్తువులకు సంబంధించి మండల స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అక్కడి నుంచి క్షేత్రస్థాయిలో గ్రామాల్లోని పాఠశాలలు, హాస్టళ్లకు వస్తువులు సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని, సరఫరాకు సంబంధించిన ఫొటోలు, వీ డియోలు తీయించాలన్నారు.
విద్యార్థుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సీఎం సూ చించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యాశాఖల మధ్య సమన్వయానికి ఒక కమిటీని నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు పీ సుదర్శన్‌రెడ్డి, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సబ్యసాచి ఘోష్, విద్యాశాఖ కార్యదర్శి యో గితా రాణా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి షఫీఉల్లా, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బాల మాయాదేవి, సెర్ప్ సీఈవో దివ్య, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్, గిరిజన సంక్షే మ శాఖ కార్యదర్శి సంతోష్, బీసీ గురుకులాల కార్యదర్శి బీ సైదులు పాల్గొన్నారు.






