29 April, 2026 | 6:09 PM

విద్యుత్ శాఖలో అవినీతి చేప

16-09-2025 02:23 PM

హైదరాబాద్: విద్యుత్ శాఖ ఏడీఈ అంబేడ్కర్ ఇళ్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఫిర్యాదుతో ఏసీబీ సోదాలు చేస్తోంది. అంబేడ్కర్ ఇళ్లు, ఆయన బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది. మణికొండ, గచ్చిబౌలి, మాదాపూర్ సహా 15 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తోంది. గచ్చిబౌలిలో ఖరీదైన భవనం గుర్తించామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్(ACB DSP Anand) వెల్లడించారు. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ లో 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని తెలిపారు. మరో వెయ్యి గజాల్లో వ్యవసాయ క్షేత్రం గుర్తించామని పేర్కొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లో సోదాలు జరుగుతున్నాయని ఏసీబీ డీఎస్పీ పేర్కొన్నారు. అంబేడ్కర్ ఆస్తులపై సోదాలు ముగిశాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ సూచించారు.