బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
08-06-2026 10:02 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మాల్తుమ్మెద గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎల్లారెడ్డి ఏఎంసి డైరెక్టర్ ఆరిఫ్ తండ్రి అజీమ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి మనోధర్యంగా ఉండాలని భరోసా కల్పించి ధైర్యం నింపారు. ఆరిఫ్ తండ్రి అంత్యక్రియలు అయ్యేవరకు కాంగ్రెస్ నాయకులు వెన్నంటి నిలిచారు.వారి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.






