28 August, 2026 | 10:52 AM

జీవో 97ను రద్దు చేయాలి

28-08-2026 12:59 AM
  1. విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం
  2. రాంచందర్ రావు, బీజేపీ నేతల అరెస్టును ఖండించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాం తి): జీవో 97తో పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడు తున్నదని, రామంతపూర్ పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావుతో సహా పార్టీ నేతల హౌస్ అరెస్టులను ఖండిస్తున్న ట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. వివాదాస్పద జీవో 97ను తక్షణమే బేషరతుగా రద్దు చేయాలని డిమా ండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ న డుపుతున్నది ప్రజాపాలన కాదు, పోలీసుల నిర్బంధపాలన అని విమర్శించారు.  బీజేపీ నేతల అరెస్టు కాంగ్రెస్ ప్రభుత్వ పిరికితనాని కి నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి  మండిపడ్డారు.