17 April, 2026 | 11:47 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

భద్రాద్రి కొత్తగూడానికి రానున్న సీఎం రేవంత్‌రెడ్డి

19-11-2025 12:31 AM

‘కొత్తగూడెంలో  మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ ప్రారంభోత్సవానికి  ఆహ్వానించిన మంత్రి తుమ్మల

డిసెంబర్ మొదటి వారంలో పర్యటన ఖరారు

 భద్రాద్రి,  నవంబర్ 18 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆహ్వానించారు. మంగళవారం  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, తుమ్మల కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు అధికారికంగా ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన సీఎం ఖచ్చితంగా జిల్లా పర్యటనకు వస్తానని పేర్కొన్నారు.

మంత్రి  ఆహ్వానం మేరకు సీఎం రేవంత్ స్పందిస్తూ, డిసెంబర్ 1 నుండి 8 వరకు ఏ తేదీనైనా కార్యక్రమాన్ని చేపట్టొచ్చు. అనుకూలమైన రోజు నిర్ణయించుకుని తెలియజేస్తానని సూచించారు. దీంతో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఖరారైంది.  ప్రారంభోత్సవానికి సిద్ధం కావాలని ఆదేశించారు. సీఎం రానున్న విషయం ఖరారైన వెంటనే మంత్రి తుమ్మల, విద్య శాఖ సెక్రటరీ శ్రీధర్  , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు, సంబంధిత శాఖలకు తక్షణమే కీలక ఆదేశాలు జారీ చేశారు.

కార్యక్రమ వేదిక, స్టేజ్, లేఅవుట్ పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. రోడ్డు, వసతులు, పార్కింగ్, రాకపోకలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని,భద్రత విషయాల్లో లోపాలు లేకుండా పోలీసు శాఖతో సమన్వయంతో పని చేయాలన్నారు. అతిథుల నిర్వహణ, వసతి, మీడియా సెంటర్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి తుమ్మల సూచించారు. విశ్వవిద్యాలయ భవనాలు, ల్యాబ్లు, మౌలిక వసతుల పరిశీలనకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.సీఎం పర్యటన నేపథ్యంలో  జిల్లా యంత్రాంగం పటిష్టమైన  ఏర్పాట్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

దేశానికే ప్రత్యేక గుర్తింపునిచ్చే వర్సిటీ..

కొత్తగూడెం మైనింగ్ విశ్వవిద్యాలయం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక సంస్థగా మారనుందని మంత్రి తుమ్మల తెలిపారు.300 ఎకరాల్లో నిర్మించిన ఈ వర్సిటీ, ఇప్పటికే ఆధ్యునిక ల్యాబ్లు, పరిశోధన కేంద్రాలు, అంతర్జాతీయ ప్రమాణాల విద్యా వసతులతో నిర్మించారు.మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుతో తెలంగాణ విద్యా రంగం జాతీయస్థాయిలో కొత్త గుర్తింపు పొందనుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

మంత్రి తుమ్మల కృషితోనే సాధ్యమైన ప్రాజెక్ట్..

మైనింగ్ కళాశాలను విశ్వవిద్యాలయంగా అప్గ్రేడ్ చేయడం, దానికి భారత మాజీ ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ పేరును నిర్ణయించడం మంత్రి తుమ్మల నిరంతర కృషి వల్లే సాధ్యమయ్యాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. జిల్లా అభివృద్ధికి తనదైన శైలిలో  పని చేస్తున్న తుమ్మల కృషికి ప్రజలు, విద్యారంగ నిపుణులు అభినందనలు తెలియజేస్తున్నారు.

యువతకు ఉపాధి  జిల్లాకు అభివృద్ధి..

వర్సిటీ ప్రారంభోత్సవం నేపథ్యంలో వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు,యువతకు పరిశోధనా, ఉపాధి అవకాశాలు,కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, పరిశోధన సంస్థలు రావడానికి మార్గం సుగమం అవుతుందన్నారు. జిల్లాలో విద్యపరిశ్రమల సమన్వయంతో ఉపాధి ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.