హైకోర్టు భవన శంకుస్థాపనలో పాల్గొనడం సంతోషంగా ఉంది
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో నిర్మించే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జోన్-2 భవన(High Court Zone-2 Buildings,) నిర్మాణ పనులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్(Supreme Court Chief Justice Justice Surya Kant) ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.
అనంతరం హైకోర్టు-2 భవన నిర్మాణ సముదాయ నమూనాలను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... హైకోర్టు భవన నిర్మాణ పనుల శంకుస్థాపనలో పాల్గొనడం సంతోషంగా ఉందని, రాజకీయ నాయకుల జీవితాల్లో ఇలాంటి సందర్భం అరుదుగా వస్తుందని పేర్కొన్నారు. ప్రార్థనా మందిరాల నిర్మాణంలో పాల్గొనడం అరుదుగా వస్తుందని, హైకోర్టు కాంప్లెక్స్ అనేది అన్ని వర్గాల ప్రజలకు ఆలయం వంటిదని సీఎం తెలిపారు. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడీషియరీ వ్యవస్థలు స్వతంత్రంగా పని చేస్తాయని ముఖ్యమంత్రి వెల్లడించారు.




