21 March, 2026 | 2:50 PM

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం, డిప్యూటీ సీఎం

21-03-2026 01:08 PM

హైదరాబాద్: దైవ ప్రార్థనలు, ఉపవాస దీక్షలతో పవిత్ర రంజాన్ మాసం చివరి రోజు  ఈద్-ఉల్-ఫితర్(Eid al-Fitr ) పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ పవిత్ర దినం అందరి జీవితాల్లో సుఖశాంతులు, ఆరోగ్యం, శాంతి, ఆనందం నింపాలని ఆకాంక్షించారు. ముస్లిం సోదర సోదరీమణులందరికీ పవిత్ర ఈద్-ఉల్-ఫితర్ (Ramzan greetings) పండుగ సందర్భంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ప్రేమ, కరుణ, సహనానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని ఆయన కోరుకున్నారు. తెలంగాణ గంగా-జమునా తెహజీబ్‌కు నెలవు.. మన రాష్ట్రంలోని మత సామరస్యం, ఐక్యత ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి, అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) నిరంతరం కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. అల్లా ఆశీస్సులతో ప్రతి ముస్లిం కుటుంబం ఆనంద ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈద్ ముబారక్(Eid Mubarak) చెప్పారు.