1 April, 2026 | 1:42 AM

స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన బాల్యమిత్రులు

01-04-2026 12:10 AM

గరిడేపల్లి, మార్చి 31 : ఆటలు ఆడుకున్నాం.. కలిసి చదువుకున్నాం.. ఆటలే కాదు కష్టంలో కూడా స్నేహితుడి కుటుంబానికి అండగా ఉంటాం అని నిరూపించారు తోటి స్నేహితులు. గరిడేపల్లి మండల కేంద్రానికి చెందిన తోటి స్నేహితుడు పిట్ట శ్రీను ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. స్నేహితుడు కుటుంబం బీద స్థితిలో ఉండటంతో ఆపదలో ఉన్న వారి కుటుంబానికి నాటి స్నేహితులు కొందరు అండగా నిలిచారు.

తనతో 1998 - 99 మండల కేంద్రమైన గరిడేపల్లి లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి బ్యాచ్ కి చెందిన స్నేహితుడు కుటుంబానికి అండగా నిలిచిన తోటి స్నేహితులు 24 వేల రూపాయలు మృతి చెందిన స్నేహితుడు భార్యకు మంగళవారం అందజేశారు.మృతి చెందిన స్నేహితుడు కుటుంబానికి అండగా నిలిచిన తోటి స్నేహితుల ఔదార్యాన్ని పలువురు అభినందించారు.ఆర్థిక సాయం అందజేసిన వారిలో  టిడిపి పార్టీ మండల అధ్యక్షుడు కీసరి నాగయ్య,మాచర్ల వెంకటేశ్వర్లు, కానుగు సోమయ్య,పెండెం పెద్ద రాంబాబు,కర్నాటి కవిత, కుక్కునూరు సుజాత తదితరులు ఉన్నారు