27 February, 2026 | 11:35 PM

Breaking News

ఉద్యమకారుల కోసం కమిటీ ఏర్పాటు పట్ల హర్షం

27-02-2026 09:38 PM

మలి దశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రాయపూడి వెంకటనారాయణ

కోదాడ: తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల మలి దశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రాయపూడి వెంకటనారాయణ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ... పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను గాలికొదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కమిటీ ఏర్పాటు చేసి విధివిధానాలు నిర్ణయించి, మలిదశ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.