5 March, 2026 | 4:53 AM

ప్రధాన రోడ్లను ఆక్రమించిన వ్యాపారం

05-03-2026 02:42 AM

సెట్ బ్యాక్ చేసినట్లే వ్యాపారులు పైకి విస్తరించారు 

బెజ్జంకి మండల కేంద్ర ంలో రోడ్ల సమస్య 

వాహనదారులకు ప్రయాణం ఇక్కట్లు

పట్టించుకోని పాలకులు పంచాయతీ అధికారులు

బెజ్జంకి,మార్చి4: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ప్రధాన రోడ్డు ఆక్రమణల సమస్య రోజురోజుకు పెరుగుతోంది. పే రుకే డబుల్ రోడ్డు వ్యాపార సముదాయాలు రోడ్డు మీదకే విస్తరించడం, వాహ నాలు ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయడం వల్ల నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

మూడు నెలల క్రితం విజయక్రాంతి పత్రికలో ఈ సమస్య ప్రచురితం కావడంతో కొంతకాలం వ్యాపారులు సెట్బ్యాక్కు వెళ్లినట్లు కనిపించింది.కొత్త పాలకవర్గం వచ్చాక ప్రస్తుతం పరిస్థితి మళ్లీ పాత స్థితికే చేరడమే కాకుండా, సమస్య మరింత పెద్దదిగా మారినట్లు స్థానికులు చెబుతున్నారు.కొంత మం ది వ్యాపారస్తులకు కొందరు వార్డు మెం బర్లు ఎక్కడైనా పెట్టుకోండి, ఎలాంటి ఇబ్బం ది ఉండదు అంటూ హామీ ఇచ్చారని వ్యాపారస్తులే బహిరంగంగా చెబుతున్నట్లు సమా చారం. ఈ వ్యాఖ్యలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలని ప్రజలు కోరుతున్నారు.బస్టాండ్ సమీ పంలో, బ్యాంక్ పరిసరాల్లో వాహనాలు రోడ్డు మీదే నిలిపివేయడంతో నడిచే వారికి స్థలం లేకుండా పోతోంది. పార్కింగ్ సౌక ర్యం లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలకు ఆటంకం కలిగి ప్రమాదాల అవకాశాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్ప టికైనా గ్రామపంచాయతీ అధికారులు స్పం దించి రోడ్డు ఆక్రమణలను పూర్తిగా తొలగించి, శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రజలు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

బోనగిరి రూపేష్ 

బెజ్జంకిలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. రోడ్డు ఆక్రమణలను తొలగించడంలో గ్రామపంచాయితీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. వెంటనే రోడ్లను క్లియర్ చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి.

దొంతరవేణి మహేష్

బస్టాండ్ సమీపం లో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. వాహనాలు రోడ్డు మీదే నిలిపివేయడంతో నడిచే వారికి కూడా దారి లేకుండా పోతోంది. అధికారులు తక్షణమే స్పం దించి ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి.