29 March, 2026 | 5:47 PM

ఏప్రిల్ 5న అయోధ్య కాశీకి బస్సు సర్వీస్

29-03-2026 04:11 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఎప్రిల్ 5 న కాశీ, అయోధ్య కు ప్రత్యేక టి జి ఆర్ టి సి నిర్మల్ డిపో లగ్జరీ సర్వీస్ నడుపుతున్నట్టు  డి. ఎం.పండరి. తెలిపారు. ఆర్టీసీ నిర్మల్ బస్టాండ్   నుండి ఎప్రిల్ 5 వ తేదీ రోజు మ!!  12 గం!! బస్సు బయలుదేరుతుంది అన్నారు. మధ్యప్రదేశ్ లోని మహైర్ శారదా దేవి శక్తి పీఠం, ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమం, శక్తి పీఠం, కాశీ, కాశీ లోని కాశీ విశ్వనాధ్ జ్యోతిర్లింగం, కాశీలో విశాలాక్షి శక్తి పీఠం, అన్నపూర్ణ, కాలభైరవ,  84 ఘాట్లు,  ధనవంతర బావి మెదలగునవి, అయోధ్య బాల రాముడు, సరయునది, శ్రీరామ్ పట్టాభిషేకం, తర్వాత లక్నొ దగ్గర గల నైమి శరణ్య దేవతలు యజ్ఞం చేసిన స్థలం, శ్రీ విష్ణు దేవాలయం, గౌమతి నది,  చక్రతీర్థమ్,ఉజ్జాయిని, జ్యోతిర్లింగం,ఉజ్జాయిని శక్తి పీఠం, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం.

మొత్తం 4 శక్తి పీఠాలు, 3 జ్యోతిర్లింగాలు దర్శించుకొనే భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది జరిగిందన్నారు. తిరిగి ఈ యాత్ర బస్సు నిర్మల్ కు 11 వ తేదీ తిరిగి వస్తుందని ఆయన తెలిపారు. 7 రోజులు యాత్ర ఉంటుందని ఒకరికి రూ.8000/- బస్ ఛార్జి ఉంటుందని ఈ సువర్ణ అవకాశాన్ని భక్తులు సద్వినియోగ పరచుకోవాలని తెలిపారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం,సుఖవంతం ఆర్టీసీ బస్సులోనే క్షేమకరమైన సంతోషకరమైన యాత్రలు చేయాలని డిపోమేనేజర్ తెలిపారు. మరిన్ని వివరాలకు 7382842582 లో సంప్రదించాలని తెలిపారు.