28 August, 2026 | 1:11 PM

శిశుమందిర్ విద్యార్థులతో రాఖీ పండుగ జరుపుకున్న బోథ్ ఎమ్మెల్యే

28-08-2026 12:10 PM

నెరడిగొండ, (విజయక్రాంతి): రాఖీ పండుగ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండ మండల కేంద్రంలోని శిశుమందిర్ పాఠశాల విద్యార్థులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ కడుతూ మీరు మాకు రక్ష, మేము మీకు రక్ష, మనమందరం దేశానికి రక్ష అంటూ చిన్నారులు చెప్పిన మాటలకు ఎమ్మెల్యే సంబురపడ్డారు. నియోజకవర్గ అన్నగా మీరు మరిన్ని సేవలు అందిస్తూ రానున్న రోజుల్లో ఉన్నత పదవులు పొందాలని చిన్నారులు కోరారు.