1 April, 2026 | 6:29 PM

Breaking News

అంబేద్కర్ సెంటర్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల   •   అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన 14వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్   •   మున్సిపల్ చైర్ పర్సన్ నివేదితను కలిసిన ఆర్యవైశ్యులు   •   గర్రెపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం   •   హైదరాబాద్ డివై డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్ కుమార్   •   మంథనిలో రన్ ఫర్ జీసస్ ను విజయవంతం చేయండి   •   మధ్యాహ్న భోజన పథకాన్ని డిగ్రీ వరకు విస్తరించాలి   •   మృతుని కుటుంబానికి గ్రామస్తులు ఆర్థిక సాయం   •   లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి   •  

బీహార్ ఎన్నికలు.. 71 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల

14-10-2025 03:04 PM

న్యూఢిల్లీ: బీహార్ రాష్ట్రంలోని అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (National Democratic Alliance) సీట్ల పంపకాల ఒప్పందంలో కొనసాగుతున్న ప్రతిష్టంభన మధ్య, బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు(Bihar Assembly Elections) 71 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ మంగళవారం విడుదల చేసింది. ఈ జాబితాలో ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా ఇద్దరూ ఉన్నారు. సామ్రాట్ చౌదరిని తారాపూర్ నుంచి పోటీ చేయగా, విజయ్ కుమార్ సిన్హా లఖిసరాయ్ నుంచి బరిలో ఉన్నారుమంత్రి నితిన్ నాబిన్(Minister Nitin Nabin) బంకీపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. రేణూదేవి భటియా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 14న లెక్కింపు జరుగుతుంది.