07-02-2026 12:16:33 AM
కరీంనగర్ 42వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి ఇంటింటి ప్రచారం
కరీంనగర్ క్రైం ,ఫిబ్రవరి6(విజయక్రాంతి): ఓటమెరుగని సునీల్ కు 42 వ డివిజన్ వాసులు అండగా నిలుస్తున్నారు. ఈ నెల 11 న జరగనున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా ఇంటింటి ప్రచారంలో 42వ డివిజన్ బీజేపీ అభ్యర్థి, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు పాల్గొన్నారు. డివిజన్‌లో అన్నివర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా సేవలందిస్తానని అన్నారు. స్థానిక 42వ డివిజన్‌లో మేయర్‌గా అనేక అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. డివిజన్‌లో ఐదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధికి కేంద్ర నిధులు తీసుకువస్తున్నారని తెలిపారు. మీ ఆశీర్వాదం వల్ల వరుసగా గెలుస్తున్నానని మరో మారు సేవచేసే భాగ్యం కల్పించాలని ఆయన ఓటర్ల ను కోరారు.