7 April, 2026 | 5:08 AM

మోదీ రాజీనామా చేయాలి

07-04-2026 01:40 AM

ఎన్నికలకు ముందు పహల్గామ్ తరహా దాడికి బ్లూప్రింట్ సిద్ధమైందా?

బెంగాల్ సీఎం మమత సంచలన ఆరోపణలు

కోల్‌కతా, ఏప్రిల్ 6: పశ్చిమ బెంగాల్ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌కు మరో రెండు వారాలే గడువు ఉంది. అటు అధికార టీఎంసీ, బీజేపీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్రమోదీ రాజీనామా చేయాలని, ఎన్నికలకు ముందు పహల్గామ్ తరహా దాడికి బీజేపీ బ్లూప్రింట్ సిద్ధమైందా? అని సంచలన ఆరోపణలు చేశారు.

కోల్‌కతాపై దాడిచే స్తామన్న పాక్ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ప్రధాని ఎందుకు స్పందించలేదని ప్ర శ్నించారు. మమత చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పందమ వుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగానే స్పందించింది. తృ ణమూల్ కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి అని, మైనారిటీల ఓట్ల కోసం ఇంతగా దిగజారిపోయిందని మండిపడింది. నాడియా జిల్లా బెతుదహరిలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో బెంగాల్ సీఎం మమతాబెనర్జీ మాట్లాడుతూ.. కోల్‌కతాపై దాడిచేస్తామన్న పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.

ఆదివారం కూచ్ బెహార్ ర్యాలీలో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. పాక్ మంత్రి బెదిరింపులపై ఎందుకు స్పందించలేదని దీదీ ప్ర శ్నించారు. ఇందుకు కారణం ఏంటి? ఏదైనా బ్లూప్రింట్ ఉందా? ఎన్నికలకు ముందు మరో పహల్గామ్ ఉగ్రదాడి జరగబోతోం దా?” అని అనుమానం వ్యక్తం చేశారు. అం తేకాడు, బెంగాల్ ప్రజలను ఢిల్లీ లక్ష్యంగా చేసుకుంటే.. తగిన విధంగా బదులిస్తామన్నారు. ‘కోల్కతాపై దాడిచేస్తామంటే భారతీయులుగా మే ము సహించం.. మౌనంగా ఉన్న మీకు(మోదీ) ఏమీ అనిపించడం లేదా? వెంటనే ప్రధాని రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు.