బీరప్ప ఆలయ స్థల వివాదం..
పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ
షాద్నగర్, అగస్టు5 (విజయక్రాంతి): ఫ రూఖ్నగర్ శివారులోని సీఎస్కే వెంచర్లో బీ రప్ప దేవాలయ స్థలం చుట్టూ తలెత్తిన వి వాదం ఉద్రిక్తంగా మారడంతో షాద్నగర్ ఎ మ్మెల్యే శంకర్ స్థలాన్ని పరిశీలించారు.
వివాదానికి ప్రధాన కారణాలు:
ప్లాట్ల యజమానుల వాదన: 2010లో హెచ్‌ఎండీఏ అనుమతులతో చట్టబద్ధంగా ప్లాట్లు కొనుగోలు చేశామని, 16 ఏళ్లుగా లేని వివాదాన్ని ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం తెచ్చిపెట్టి తమ స్థలాలను ఆక్రమించే కుట్ర చేస్తున్నారని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వెంచర్ ప్రారంభంలో దేవాలయానికి ప్రత్యామ్నాయ స్థలం ఇస్తామని చెప్పి రియల్టర్లు మోసం చేశారని, గుడి విస్తరణకు ప్లాట్ల యజమానులు అడ్డుచెప్పడం సరికాదని భక్తులు పేర్కొంటున్నారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఇతర నేతలు ఆ స్థలాన్ని గుడికే కేటాయించాలని డిమాండ్ చేయడంతో ఉద్రిక్తత పెరిగింది.రియల్ ఎస్టేట్ యాజమాన్య నిర్లక్ష్యం వల్లే ఈ సమస్య వచ్చిందని, దేవాలయ స్థల వివాదంపై రాజకీయాలు చేయవద్దని ఎమ్మెల్యే సూచించారు.






