9 April, 2026 | 3:15 AM

ఎలాంటి హామీ ఇవ్వలేదు

09-04-2026 01:17 AM

టిమ్ డ్రైవర్స్ శిక్షణకు ఆర్టీసీ సంఘాలు వ్యతిరేకం

బాన్సువాడ డిపో మేనేజర్ ప్రచారం అబద్ధం

బాన్సువాడ,ఏప్రిల్ 8 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్టీసీ డిపోలో జరుగుతున్న టిమ్ము డ్రైవర్ల శిక్షణ లో ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ సంఘాలు బాన్సువాడ డిపో మేనేజర్ రవికుమార్ కు డ్రైవర్ టిమ్ము శిక్షణ సర్వీసుల విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేదనీ టిమ్ము డ్రైవర్ల శిక్షణకు అన్ని సంఘాలు వ్యతిరేకమని సంఘాల ప్రతినిధులు తెలిపారు. కక్షపూరితంగా బాన్సువాడ డిపో మేనేజర్ రవికుమార్ సంఘాల పేరుతో తప్పుడు సమాచారాన్ని లేబర్ ఆఫీసర్ ఉత్తరం ద్వారా చేరవేశారనీ వారు ఆరోపిస్తున్నారు.

ఇందులో సంక్షేమ సంఘాల ప్రమేయం ఏమీ లేదనీ బాన్సువాడ డిపో మేనేజర్ దగ్గర సంక్షేమ సంఘాలు ఏదైనా లెటర్ ద్వారా ఒప్పంద పత్రం ఉంటే విడుదల చేయగలనీ ఇట్టి విషయమై విజిలెన్స్ ఎంక్వైరీ చేయించాలి తప్పుడు నివేదిక పంపిన డిఎం పై తగు చర్య తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు . ఈ కార్యక్రమంలో ఎస్సీ సంఘం నేత చింతల్ రాములు ఎస్టీ సంఘం నేత చందర్ నాయక్ బిసి సంఘం నేతలు గిరిధర్ శంకర్ గౌడ్ మల్లయ్య గున్నాల రవీందర్ గౌడ్ గోలి లక్ష్మణ్ తులసి రామ్ మారుతి మైనార్టీ సంఘం నేతలు మాజీద్ ఆఫీస్ సలీం ఉన్నారు.