23 July, 2026 | 2:33 PM

సుప్రీంకోర్టులో బండ్ల గణేష్‌కు ఎదురుదెబ్బ

23-07-2026 01:47 PM

న్యూఢిల్లీ: ప్రముఖ సినీనిర్మాత బండ్ల గణేశ్ పిటిషన్(Bandla Ganesh petition)ను సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. దీంతో బండ్ల గణేష్‌కు సుప్రీంకోర్టులో  ఎదురుదెబ్బ తగిలింది ఆస్తులు స్వాధీనం చేసుకోవడంపై జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. బండ్ల గణేశ్, కుటుంబసభ్యుల ఆస్తిని యూబీఐ(యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) వేలం వేసిన ఆస్తులు స్వాధీనం చేసుకుంది. రుణ ఎగవేత కేసులో బండ్ల గణేష్ ఆస్తులు వేలం వేశారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను బండ్ల గణేశ్ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు(Supreme Court) మెట్లు ఎక్కారు. డెట్ రికవరీ ట్రైబ్యునల్ ఆదేశాలు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పులో జోక్యానికి సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్ లిమిటెడ్ తీసుకున్న అప్పులకు బండ్ల గణేష్ కుటుంబం హామీదారులుగా ఉన్నారని యూనియన్ బ్యాంక్ కోర్టులో వాదనలు వినిపించింది.