28 July, 2026 | 1:47 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించండి

03-06-2026 04:18 PM

అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్య

బోథ్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో మన భవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్య భవన కొనసాగుతూ ఉండడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని నేరడిగొండ గ్రామ సర్పంచ్ నీలిమ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలో గ్రామసభ నిర్వహించి విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామస్తుల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ... మోజులో పడవద్దని డబ్బులు ఖర్చు చేసుకొని ప్రైవేటు పాఠశాలల్లో చదివించవద్దన్నారు. రానున్న సంవత్సరంలో నేరడిగొండ పాఠశాల నర్సరీ నుండి 12వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో మార్చేందుకు స్థానిక ఎమ్మెల్యే జాదవ్ అనిల్ కృషి చేస్తున్నారన్నారు. అన్ని రకాల వసతులు ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను పంపించాలని ఆమె కోరారు.