12 May, 2026 | 4:42 AM

హెచ్‌పీవీ వాక్సిన్‌పై అవగాహన కల్పించాలి

12-05-2026 12:00 AM

--జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 

మెదక్, మే 11 (విజయ క్రాంతి) :హెచ్ పి. వి వాక్సిన్ పై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అధికారులు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్లో హెచ్ పి వి వాక్సిన్ పై, ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలపై, సి ఎస్ ఆర్ నిధులపై, ఉపాధి హామీ పథకం, జనగణన పై, సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 14 నుంచి 15 మధ్య వయస్సు గల బాలికలందరికి హెచ్ . పి .వి వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.

వ్యాక్సిన్ పై ముందుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వ్యాక్సిన్ వల్ల ఉపయోగాలను వివరించాలన్నారు. ఈ నెల 13 నుంచి 21 వరకు జరిగే ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.విద్యార్థులు పరీక్షలను ప్రశాంత వాతావరణంలో రాయడానికి కావలసిన ఏర్పాట్లు అన్ని పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. పరిశ్రమలు సి ఎస్ ఆర్ నిధులను సమాజ హితం కోసం అందించాలని పిలుపునిచ్చారు. ఐటిఐ, డిప్లమా, పాలిటెక్నిక్ విద్యార్థులు నేషనల్ అప్రెంటిషిప్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

జిల్లాలో ఉపాధి హామీ కార్మికుల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. జాబు కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వందరోజుల పని కల్పించి ఉపాధి కల్పించాలన్నారు. జనగణన లో ప్రజలందరి భాగస్వామ్యం చేయాలన్నారు. ఈరోజు నుంచి హౌస్ లిస్టింగ్ ప్రక్రియ ప్రారంభమైందని, దానిని సక్రమంగా చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ , జెడ్పిసిఓ ఎల్లయ్య, డిఆర్‌ఓ అంబాదాస్ రాజేశ్వర్, జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారిని మాధురి, మెడికల్ సూపరిండెంట్ సునీత దేవి, డి సి హెచ్ శివ దయాల్, తదితరులు పాల్గొన్నారు.