సైబర్ నేరాలపై అవగాహన
06-08-2026 01:46 AM
శంకర్‌పల్లి, ఆగస్టు 5 (విజయ క్రాంతి): మోకిలలో బుధవారం నేషనల్ సైబర్ జాగ్ర త్త క సందర్భంగా సైబర్ నెలలపై మోకిలా పోలీసులు పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమం ప్రాచీన్ గ్లోబల్ స్కూల్లో జరిగింది. సైబర్ నేరాలపై విద్యార్థులకు సీఐ శ్రీనివాస్ రెడ్డి అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఈ మేరకు వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్త్స్ర సురేష్ గౌడ్, సిబ్బంది, పాఠశాల మేనేజ్మెంట్, విద్యార్థులు పాల్గొన్నారు.






