9 May, 2026 | 10:43 AM

Breaking News

కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి నియామకం   •   నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిర‌ల్ కృష్ణస్వామినాథ‌న్ నియామ‌కం   •   గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •   భయం అవుట్ భరోసా ఇన్   •  

సల్వాజుడుంపై అమిత్‌షా వ్యాఖ్యలు సత్యం

03-09-2025 01:21 AM

బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ మర్రి శశిధర్ రెడ్డి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: జస్టిస్ సుదర్శన్ రెడ్డి 2011 జూలై 5 ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు వల్లే సల్వా జుడుంను రద్దు చేయడంతో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లకు పెద్ద దెబ్బ తగిలిందని హోం మంత్రి అమిత్ షా ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వివాదంపై బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ శశిధర్ రెడ్డి స్పందించారు. ‘సల్వా జుడుం అనేది కేంద్ర నిధులతో రాష్ట్రాల్లో నడిచిన కార్యక్రమం.

కాంగ్రెస్ ప్రభుత్వంలో మాజీ హోం మంత్రి చిదంబరం 2008లో రాజ్యసభలో సీపీఐ నాయకుడు రాజా అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాష్ర్టేతర శక్తులకు నేను మద్దతివ్వనని చెబుతూ సల్వాజుడుంను తిరస్కరించారు. అదే చిదంబరం 2011 జూలైలో స్పందిస్తూ.. ఈ తీర్పు మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లను ప్రభావితం చేయవచ్చని అంగీకరించారు. 10వ ప్రణాళిక సంఘం 2002లో ‘సమ్ వికాస్ యోజన’ను ప్రారంభించింది.

ఇందు లో వెనుకబడిన జిల్లా ఇనిషియేటివ్ అనే వి భాగం ఉండేది. ఈ కార్యక్రమం ద్వారా 147 జిల్లాలను కవర్ చేశారు. మావోయిస్టు ఉద్య మం వల్ల ఎక్కువగా ప్రభావితమైన 50కి పైగా జిల్లాలు అందులో ఉన్నాయి. చెన్నా రె డ్డి మెమోరియల్ ట్రస్ట్ తరపున మావోయి స్టు సమస్యలపై పనిచేసినందున 2004లో మావోయిస్టు హింసపై ఒక జాతీయ టాస్క్ ఫోర్స్‌కు కన్వీనర్‌గా నన్ను నియమించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విధానాలు, కార్యక్రమాలు, ప్రణాళి కల కోసం సిఫార్సులు చేయడం ఈ టాస్క్‌ఫోర్స్ ఉద్దేశం. సల్వాజుడుం 2005లో కాం గ్రెస్ ఎమ్మెల్యే మహేంద్ర ఆధ్వర్యంలో మొద లై, తిరుగుబాటు వ్యతిరేక చర్యలలో ఒక మిలిటరీగా మారింది. సుప్రీంకోర్టు సల్వాజు డుం ను నిషేధించకపోతే.. 2020 నాటికి మావోయిజం అంతమై ఉండేది అని సూటిగా చెప్పినప్పుడు చాలా మంది విమర్శించారు.

షా చేసిన వ్యాఖ్యలను మొదట 18 మంది న్యా యమూర్తులు వ్యతిరేకించారు. ఇటువంటి వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.  న్యాయ కోవిదుడిని కాకపోయినా.. దశాబ్దాలుగా న క్సలిజం చర్యలను దగ్గరి నుంచి చూ స్తున్న వ్యక్తిగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నా’ అని పేర్కొన్నారు.