మహిళా స్వాతంత్య్ర ప్రదాత, భారత రాజ్యాంగ శిల్పి అంబేద్కర్
ఘట్ కేసర్, మార్చి 8 (విజయక్రాంతి) : మహిళా స్వాతంత్య్ర ప్రదాత, భారత రాజ్యాంగ శిల్పి భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని రిసోర్స్ పర్సన్, ఎస్హెచ్జి, ఘట్కేసర్ టి. మాధవి కొనియాడారు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి 256వవారం నిత్య పూలమాల కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాధవి ముఖ్యఅతిథిగా విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ జీవితం అనేది సమాజంలోని అణగారిన వర్గాల కోసం, మహిళల సాధికారత కోసం, కార్మికుల హక్కుల కోసం, విద్య కోసం, సమానత్వం కోసం సాగిన నిరంతర పోరాటం అన్నారు. ఆయన కేవలం భారత రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు, దోపిడీకి గురైన ప్రతి మనిషికి గౌరవం, స్వేచ్ఛ, హక్కులు కల్పించి, సమాజాన్ని సమానత్వ మార్గంలో నడిపించిన మహానాయకుడు అంబేద్కర్ అని కీర్తించారు. ప్రబుద్ధ భారత్ సబ్యులు పాల్గొన్న మహిళలను శాలువా కప్పి సన్మానించారు.
కేక్ కట్ చేసి ఆనందంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మేకల దాసు, ఉపాధ్యక్షులు కడపోల్ల బిక్షపతి, ప్రధాన కార్యదర్శి ఇరిటపు శ్రీనివాస్, మీసాల అరుణ్ కుమార్, మహిళ సంఘాల నాయకురాళ్ళు ఎరోళ్ల రాణి, రొడ్డ అనురాధ, పి. రాజేశ్వరి, ఎం. మానస, గ్యార జయమ్మ, ఎ. రమాదేవి, రేణుక, ఎ. ఊర్మిళ, ఎం. మానస, బి. ఝాన్సీ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.




