14 April, 2026 | 8:29 PM

కోల్ బెల్ట్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2026 04:25 PM

శ్రీరాంపూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయంలో బాబా సాహేబ్ అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఏరియా ఎస్సీ లైజన్ ఆఫీసర్ ఆనంద్‌ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జీఎం మునిగంటి శ్రీనివాస్‌ ముఖ్య అతిధిగా హాజరై జెండా ఎగరవేశారు. అనంతరం జీఎం కార్యాలయం ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహానికి అధికారులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉద్యోగులు గోషిక మల్లేషం, యుగంధర్‌ సాయిలు బుద్ద వందనం, పంచశీల పఠనం నిర్వహించారు.

అనంతరం జీఎం కార్యాలయ కాన్ఫరెన్స్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ అణగారిన, దళిత, బహుజన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ప్రపంచం గుర్తించిన మహామేధావి, దేశ అత్యంత గొప్ప పురష్కారం భారతరత్న పొందటమే కాకుండా 32 డిగ్రీలు చదివి, 190 దేశాల రాజ్యాంగాలు చదవి మన దేశ అవసరాలకు అనుగుణంగా సమాజంలో నెలకొన్న అంతరాలను తొలగించేలా అందరికీ సమానహక్కులు కల్పిస్తూ రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటూ జీఎం N. సత్యనారాయణ, గుర్తింపు సంఘం బ్రాంచి సెక్రటరీ బాజీ సైద, ఉద్యోగుల సంఘం బ్రాంచి అధ్యక్షులు వెంకటేశ్వర్‌ రెడ్డి, ఎస్సీ లైజన్ ఆఫీసర్ ఆనంద్ కుమార్, డీజీఎం(ఐఈడీ) రాజన్న, డీజీఎం(పర్సనల్) అనిల్‌ కుమార్, ఎస్టీ లైజన్ ఆఫీసర్ గుండే రావు, సీనీయర్ పీఓ సురేందర్, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, ఉద్యోగులు తదితరులు పాల్గన్నారు.