విద్యార్థుల సౌకర్యార్థం ఫ్రిజ్ ను అందజేసిన పూర్వ విద్యార్థులు
20-08-2026 07:57 PM
* తాము చదివిన పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు
గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలంలోని కీతవారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల అవసరాల కోసం తాగునీటి డిస్పెన్సర్ ఫ్రిజ్ ను పూర్వ విద్యార్థులు గురువారం పాఠశాలకు అందించారు. 1993 - 1994 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు తమ చదివిన పాఠశాలకు 16 వేల రూపాయలతో ఈ డిస్పెన్సరీ ఫ్రిడ్జ్ ను పాఠశాలకు అందించారు.
పాఠశాల అభివృద్ధిలో పాలుపంచుకునేందుకు వీలైనంత చేయూత అందిస్తామని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. తాము చదివిన పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేసేందుకు ముందుకు వచ్చిన పూర్వ విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






