విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందజేస్తున్న ఆల్ ఫోర్స్ విద్యాసంస్థలు
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): విద్యార్థులకు అల్ఫోర్స్ విద్యాసంస్థలు మంచి విద్యను అందిస్తున్నాయని, వారి బంగారు భవిష్యత్తుకు అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆల్ ఫోర్స్ హైస్కూల్లో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న విజయ రమణారావు మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో కార్పొరేట్ విద్యను అందిస్తూ నరేందర్ రెడ్డి అందరికీ ఆదర్శ ప్రాయుడయ్యాడని కొనియాడారు. అంతకుముందు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారులు ఇంగ్లీషులో ఎంతో చక్కగా మాట్లాడడం, నృత్యాలు చేయడం అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలైన వారికి విజయ రమణారావు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి విజయ రమణారావును, అతిథులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, కౌన్సిలర్లు గాదాసు మంజుల, రవీందర్, గరిగే శ్రీనివాస్, చింతల రాజు, టీకే ప్రభాకర్, మాజీ జెడ్పిటిసి డాక్టర్ అయిల రమేష్, మాజీ మార్కెట్ చైర్మన్ సాయిరీ మహేందర్, కందుకూరి ప్రకాష్ రావు(పెద్దన్న), వేగోళం అబ్బయ్య గౌడ్, కందునూరి కుమార్ పలువురు పాల్గొన్నారు.




