14 June, 2026 | 4:27 AM

ఐఐటీ, ఎన్‌ఐటీలలో అల్ఫోర్స్ విద్యార్థులకు సీట్లు

14-06-2026 12:00 AM

కొత్తపల్లి, జూన్ 13 (విజయక్రాంతి): జేఓఎస్‌ఎస్‌ఏ -2026 మొదటి రౌండ్ కౌన్సిలింగ్ ద్వారా 108 మంది అల్ఫోర్స్ విద్యార్థులు జాతీయ స్థాయి ఐఐటీ, ఎన్‌ఐటీలలో సీట్లు పొందారు. ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిష్ఠాత్మక ఐఐటీలలో 31 మంది, ఎన్‌ఐటీలలో 36 మంది, వివిధ ఐఐఐటీలలో 16 మంది, 25 మంది విద్యార్థులు వివిధ ఐఐఇఎస్టీ, బిట్టు, జీఎఫ్‌టీఐ, ఎస్‌ఎన్‌ఐటీ, ఎన్‌ఐఎల్‌ఐటీ, సీయూ హెచ్‌లలో సీట్లు సాధించి అల్ఫోర్స్ ఖ్యాతిని పెంచారని తెలిపారు.

యూజీఈఈ ద్వారా జీ ఆశిస్ రెడ్డి ఐఐఐటీ హైదరాబాద్, ఐఐటీ జేఈఈ మెయిన్స్‌లో పటేల్ అక్షయ రెడ్డి ఐఐఐటీ- హైదరాబాద్‌లో సీటు సాధించారని తెలిపారు. మొదటి రౌండు కౌన్సిలింగులోనే 108 మంది విద్యార్థులు సీట్లు సాధించడం గర్వకారణమన్నారు. రాబోయే వివిధ రౌండులలో అనేక మంది అల్ఫోర్స్ విద్యార్థులు ప్రతిష్ఠాత్మక జాతీయస్థాయి విద్యా సంస్థలలో సీట్లు సాధిస్తారని ఆకాంక్షించారు. సీట్లు సాధించిన విద్యార్థులను అభినందించారు.