22 June, 2026 | 1:28 PM

Breaking News

తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •   మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే   •   చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది   •   యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి   •   APSRTC బస్సు, లారీ ఢీ: ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు   •   ప్రీ-ప్రైమరీ స్కూల్.. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది   •  

కుల, మతాలకు అతీతం అలయ్ బలయ్

13-10-2025 12:28 AM

-ఆదర్శ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అలాయ్ బలాయ్

-ముఖ్యఅతిథిగా పాల్గొన్న మల్కాజిగిరి ఎంపీ ఈటల

మేడిపల్లి, అక్టోబర్ 12 (విజయక్రాంతి):మేడిపల్లి లోని వినాయక్ నగర్ లో ఆదర్శ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 25వ వార్షికోత్సవ సందర్భంగా శనివారం రాత్రి అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ’అలయ్ బలయ్’ కార్యక్రమం, సంస్కృతీ సాంప్రదాయ సమ్మేళనం, సామరస్య నికి, తెలం గాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని, ఐక్యతను చాటిచెప్పే గొప్ప వేదిక ’అలయ్ బలయ్’ కార్యక్రమం,రాజకీయ, కుల, మత విభేదాలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను, ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు.అలయ్ బలయ్’ అనేది కేవలం ఒక పండుగ వేడుక మాత్రమే కాదు, ’సమాజంలో సామరస్యం, ఐక్యత, సోదరభావం’ అనే గొప్ప సందేశాన్ని ప్రతి ఏటా చాటిచెప్పే తెలంగాణ ఆత్మగా దీన్ని అభివర్ణిస్తారు.

ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం బిజెపి పార్టీ ఇంచార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, స్థానిక మాజీ కార్పొరేటర్ పాశం శశిరేఖ బుచ్చి యాదవ్, పిర్జాదిగూడ మాజీ కార్పొరేటర్లు,ఆదర్శ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు మేడ బోయిన విజయ్ కుమార్, పోలీస్ తిరుపతిరెడ్డి, బాడిశెట్టి ఎల్లయ్య, తునికి కోటయ్య, రావుల మధుసూదన్, మంగళారపు శ్రీనాథ్, పోలీస్ సురేందర్ రెడ్డి,గడ్డం రాజు, కడారి శేఖర్,గొడిశాల రఘు, లగ్గాని సోమేశ్ గౌడ్,స్నానం చెర్ల శ్రీనివాస్, గడ్డం పరమేష్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.