30 May, 2026 | 2:40 AM

కాంగ్రెస్ నుంచి అలామ్‌ఖాన్ బహిష్కరణ

30-05-2026 01:49 AM

పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి వెల్లడి 

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): న్యాయవాది హత్య కేసులో ఆరోపణలపై అరెస్ట్ అయిన పీసీసీ ఉపాధ్యక్షుడు అలామ్ ఖాన్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. హైదరాబాద్‌లో న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసులో అలామ్ ఖాన్‌తో పాటు ఆయన కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అంశాన్ని పార్టీ  క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణించి ఆయనపై బహిష్కరణ వేటు వేశామని మల్లు రవి వివరించారు.