14 June, 2026 | 4:26 AM

ఎయిర్‌ఫోర్స్ విమానం క్రాష్

14-06-2026 01:13 AM
  1. ఐదుగురి దుర్మరణం
  2. మృతుల్లో ఒక పైలెట్, మరో నలుగురు సిబ్బంది
  3. కో పైలెట్‌కు తీవ్ర గాయాలు, ఆసుపత్రిలో చికిత్స
  4. అసోంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో ఘటన
  5. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తునకు ఆదేశం

దిస్పూర్, జూన్ 13: అసోంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో ఘోర విమాన ప్రమా దం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రం గా గాయపడిన కో పైలెట్‌కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్ 32 కార్గో విమానం సైనికులు, సామగ్రితో అసోంలోని జోర్హాట్ రౌరియా ఇండియన్ ఎయిర్ బేస్‌లో ల్యాండింగ్ అవుతుండగా కూలిపోయింది.

విమానం కూల గానే భారీ ఎత్తున మంటలు చెలరేగి రెండు ముక్కలయ్యింది. ప్రమాదంలో ప్రయాణిస్తున్న స్కాడ్రన్ లీడర్ ప్రశాంత్ సింగ్, ఫ్లుటై లెఫ్ట్‌నెంట్ శుభం కుమార్, సార్జెంట్ జితేంద్ర శర్మ, అగ్నివీర్వాయు ఖేమరం కుమావత్, అగ్నివీర్వాయు డానిష్ ఆలం ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని విమానంలో చెలరేగిన మంటలను ఆర్పివేశాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతుందని, కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించినట్లు భారత వైమానిక దళం ప్రకటించింది. ప్రమాదస్థలికి చేరుకున్న ఉన్నతాధికారులు సహాయక చర్యల్లో వేగం పెంచారు. 

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్భ్రాంతి..

విమాన ప్రమాదంలో వాయుసేనకు చెం దిన ఐదుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోవడంపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వాయుసేన యోధుల కుటుంబాలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. దేశానికి వారు అందించిన సేవలను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటామన్నారు. ప్ర మాదంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు ‘ఎక్స్’లో తెలిపా రు.

ఏఎన్

ఏఎన్ 32 సైనిక, కార్గో రవాణా విమా నం. భారత్ వద్ద ఈ తరహా విమానాలు 100వరకు ఉన్నాయి. 7.5 టన్నుల సరుకు, 50 మంది ప్రయాణికులు, 42 మంది పారాట్రూపర్లను రవాణా చేయగలదు. ప్రతికూల వాతావరణంలో ఈ తరహా విమానా లను భారత రక్షణ శాఖ ఉపయోగిస్తుంది.

2026లో ప్రమాదాలు..

ఉత్తరప్రదేశ్‌లోని ఐఏఎఫ్ శిక్షణ వి మానం జనవరి 21న కూలిపోయింది. ఇందులో ఇద్దరు పైలెట్లు సురక్షితంగా బయటపడ్డారు. హెచ్‌ఏఎల్‌కు చెందిన తేజస్ ఫిబ్రవరి 7న టేకాఫ్ సమయం లో రన్‌వే నుంచి పక్కకు జారిపోయిం ది. పైలెట్ స్వల్పగాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. అసోంలోని కర్బీ ఆంగ్‌లాంగ్ ప్రాంతంలో ఎంకెఐ శిక్షణ విమానం మార్చి 5న కూలిపోయింది. ఇద్దరు పైలెట్‌లు మృతి చెందారు. వీరి లో ఒకరు ఆపరేషన్ సిందూర్‌లో విశేష ధైర్యసాహసాలను ప్రదర్శించారు. పూ ణే అంతర్జాతీయ విమానాశ్రయంలో వైమానిక దళ యుద్ధ విమానం ఏప్రిల్ 17న రన్‌వేను ఢీకొట్టింది. దీంతో రన్‌వేను 11 గంటలపాటు మూసివేశారు.