ఏఐ ప్లస్ స్మార్ట్‌ఫోన్ ప్రాజెక్ట్ ట్రస్ట్ ప్లస్
విశాఖపట్నం,ఆగస్టు 5 : భారతీయ స్మార్ట్‌ఫోన్ రంగంలో ఒక విప్లవాత్మక చర్యగాఏఐ ప్లస్ స్మార్ట్‌ఫోన్ ’ప్రాజెక్ట్ ట్రస్ట్ ప్లస్‌ను ప్రారంభించింది. దీర్ఘకాలిక కమ్యూనిటీ భాగస్వామ్యం ద్వారా దేశంలోనే అత్యంత సురక్షితమైన స్మార్ట్‌ఫోన్ ఎకోసిస్టమ్‌ను సృష్టించడానికి ఈ కార్యక్రమం కీలకం కానుంది. తమ పరికరాలలో భద్రతను మెరుగుపరచడానికి , నమ్మకాన్ని పెంపొందించడానికి టెక్ , డెవలపర్ కమ్యూనిటీని ఆహ్వానించేందుకు,ఈ సంస్థ రాబోయే ఐదేళ్లలో ఏటా రూ.20కోట్లు చొప్పున మొత్తం రూ.100 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించింది.
ఈ కార్యక్రమం ద్వారా కంపెనీ,తమ సిస్టమ్‌లను చురుకుగా పరీక్షించడానికి,తమ భద్రతా నిర్మాణాన్ని సవాలు చేయడానికి,వినియోగదారులపై ప్రభావం చూపకముందే పరిష్కరించగల లోపాలను ఎత్తి చూపడానికి స్వతంత్ర పరిశోధకులను ఆహ్వానిస్తోంది.భద్రత అనేది ఒక అంతిమ గమ్యం కాకుండా, నిరంతరం కొనసాగే ప్రయాణం అనే నమ్మకంతో’ప్రాజెక్ట్ ట్రస్ట్ ప్లస్ నడుస్తోందని ఏఐ ప్లస్ స్మార్ట్‌ఫోన్ సీఈఓ మాధవ్ షెత్ చెప్పారు. ప్రాజెక్ట్ ట్రస్ట్ ప్లస్ అనేది ఆ నమ్మకాన్ని పారదర్శకంగా,అందరి సహకారంతో నిర్మించాలన్నదే తమ లక్ష్యమన్నారు.






