27 April, 2026 | 2:44 AM

ఏడేళ్లుగా నిర్మాణం పూర్తి కాని గ్రంథాలయం

27-04-2026 12:58 AM

హుస్నాబాద్, ఏప్రిల్ 26: హుస్నాబాద్ పట్టణంలో ఏడు సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్న గ్రంథాలయ భవనం ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పాత గ్రంథాలయం శిథిలావస్థకు చేరడంతో మండల పరిషత్ కార్యాలయం సమీపంలో కొత్త భవన నిర్మాణానికి నిధులు కేటాయించగా, పనులు 70 శాతం పూర్తయ్యాయి.

అయితే లాట్రీన్లు, బాత్రూంలు, ప్రహరీ గోడ, ఫర్నిచర్ వంటి పనులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. సుమారు 30 లక్షల రూపాయలు కేటాయిస్తే గ్రంథాలయం అందుబాటులోకి వస్తుందని బి ఎస్ పి నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ తెలిపారు.

ప్రభుత్వం మారి రెండున్నరేళ్లు గడిచినా పట్టించుకోలేదని విమర్శించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, నిరుద్యోగులకు గ్రంథాలయం ఎంతో అవసరమని, వెంటనే మిగిలిన పనులు పూర్తి చేసి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బి ఎస్ పి నాయకులు డేగల వెంకటేష్, ఎలగందుల శంకర్ తదితరులు పాల్గొన్నారు.