8 April, 2026 | 4:12 PM

Breaking News

ఏప్రిల్ 10న రాజ్యసభ సభ్యుడిగా నితీష్ ప్రమాణస్వీకారం.. సీఎం పదవికి రాజీనామా తేదీపై అనిశ్చితి   •   ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం: మంజీ నాయక్   •   సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్   •   నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి   •   ప్రజల వద్దకే మినీ బ్యాంక్ సేవలు   •   ఈనెల 21న మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ ఎన్నిక   •   ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   అర్జీ-3లో సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు   •   ఇరాన్‌లోని భారతీయులకు అత్యవసర హెచ్చరిక— హెల్ప్ లైన్ నంబర్లు ఇవే   •   లక్ష్మీ నగర్ ట్రాఫిక్ ను మరిపిస్తున్న మంథని   •  

మిత్రుని కుటుంబానికి అండగా మిత్రబృందం

30-11-2025 05:12 PM

స్నేహితుని కూతుళ్ళ పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్..

చిట్యాల (విజయక్రాంతి): తమతో పాటు కలిసి చదువుకున్న బాల్యమిత్రుడు అకాల మరణం చెందడంతో అతని మిత్రులంతా కలిసి ఆదివారం మృతుని కుటుంబ సభ్యులకు 60,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. చిట్యాల పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004-05  విద్యా సంవత్సరంలో తమతో పాటు 10వ తరగతి  చదివిన మేడి యాదగిరి ఇటీవల ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బాల్య మిత్రులందరు తన స్నేహితుని ఆర్థిక పరిస్థితిని గుర్తుతెరిగి అందరూ కలిసి 60 వేల రూపాయలు జమ చేశారు. అట్టి డబ్బులు మొత్తం మృతునికి గల ఇద్దరు కూతుర్లు పేరుమీద ఒక్కొక్కరికి 30 వేల చొప్పున స్థానిక పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి అట్టి పత్రాలను కుటుంబ సభ్యులకు అందచేశారు.