ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం
బడ్జెట్లో దళితులకు భారీ కోత
కెవిపిఎస్ జిల్ల ప్రధాన కార్యదర్శి బోట్ల శేఖర్
జనగామ, (విజయక్రాంతి): 2026- 27 ఆర్థిక సంవత్సరానికి నిన్న రాష్ట్ర అసెంబ్లీలో మల్లు భట్టి విక్రమార్క 3.24.254కోట్ల రూ. లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో దళితులకు భారీ కోత పెట్టారని 40వేల కోట్ల రూ. ల నుండి 11.784 కోట్ల రూ లకు తగ్గించి దళితులను మోసగించారని ప్రభుత్వం ఆర్బాటంగా ప్రకటించిన చేవెళ్ల ఎస్సి ఎస్టీ డిక్లరేషన్ ఊసెత్త లేదని బడ్జెట్లో దళితులను మోసగించిన తీరుపై ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు ప్రభుత్వం దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది.
ఈ మేరకు బడ్జెట్ పై శనివారం రోజు కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు తోటి దేవదానం అధ్యక్షత వహించగా కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి బొట్ల శేఖర్ మాట్లాడుతూ.. దళితుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ లొనే దళితులను మోసగించిందని బడ్జెట్లో దళిత సంక్షేమానికి ప్రభుత్వ కేటాయింపులకు విడుదలకు ఖర్చుకు మధ్యన ఏమాత్రం పొంతన ఉండటం లేదని విమర్శించారు గత బడ్జెట్ లో 40 వేల కోట్ల రూపాయలు కాగితాల్లో కేటాయించి 19 వేల కోట్ల రూపాయలు విడుదల చేసి అందులో 14 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసినట్లు చూపించారని చెప్పారు.9 శాఖలు నయా పైసా ఖర్చు చేయలేదని విమర్శించారు
2026-27 సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి 11784కోట్ల రూ. లు కేటాయించారని చెప్పారు. ఎస్సి ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఎక్స్ గ్రేషియోలు వేలాది మంది కి బాధితులకు బడ్జెట్ లేమి తో అందలేదన్నారు కులాంతర వివాహితుల ప్రోత్సాహకాలు రెండేండ్లుగా పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు.మొత్తం ఎస్సీ సంక్షేమం పైన ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. బడ్జెట్లో ప్రతి ఏట అంకెలు మాత్రమే ఉంటున్నాయని అవి ఖర్చుకు నోచుకోకపోవడంతో దళితుల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందన్నారు.
సాంఘిక సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్ హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం దక్కట్లేదన్నారు విద్యార్థులు తీవ్ర స్వస్థత గురికావడం ఆత్మహత్యలు జరగడం పరిపాటిగా మారిందన్నారు హాస్టల్ అద్దే భవనాల కిరాయిలు చెల్లించకపోవడం, బెస్ట్ అవైలే బుల్ స్కూల్ పిల్లలకు బడ్జెట్ ఇవ్వకపోవడంతో ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థులను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు.రాజీవ్ యువశక్తి పథకం క్రింద 16 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని ప్రభుత్వం 6000కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించిందన్నారు అవి ఏమాత్రం సరిపోవు అన్నారు.
ఎస్సీ జనాభా 18% ఉండగా ప్రభుత్వ కేటాయింపులు జనాభా దామరక్ష ప్రకారంగా లేవన్నారు గత మూడేళ్ల కాలంలో కేటాయించిన బడ్జెట్ పెట్టిన ఖర్చు మొత్తం దళితుల బడ్జెట్ పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జోగు ప్రకాష్ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి అజ్మీర సురేష్ నాయక్ జిల్లా ఉపాధ్యక్షులు మబ్బు ఉప్పలయ్య గడ్డం యాదగిరి నక్క మంజులసిరిగిరి కిష్టయ్య గడ్డం చంద్రకళ ఓద్య నాయక్ నాగిల్ల విజయ్ గౌతమ్, వంశి, కోటి తదితరులు పాల్గొన్నారు.




