శాస్త్రవేత్తల క్షేత్ర సందర్శన
బిజినేపల్లి, సెప్టెంబర్ 25 : పాలెం కృషి విజ్ఞాన కేంద్రం(Palem Krishi Vigyan Kendra) శాస్త్రవేత్తలు(Scientists) తిమ్మాజీపేట మండలంలోని(Thimmajipet Mandal) గుమ్మకొండ, ఏదిరేపల్లి, మారేపల్లి, అప్పాజీపల్లి గ్రామాల్లో మినుము, మిరప, వరి, పత్తి, కంది మరియు మొక్కజొన్న పొలాలను(Cornfields) శుక్రవారం క్షేత్ర స్థాయిలో సందర్శించారు. ప్రస్తుత పంట పరిస్థితులు, పురుగులు మరియు తెగుళ్ల ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి, పంటల వారీగా సస్యరక్షణ చర్యలను సూచించారు.
ప్రస్తుతం మినుము పంట పూత నుంచి కాయ ఏర్పడే దశలో ఉందని సస్యరక్షణ శాస్త్రవేత్త డా. ఓ. శైల అన్నారు. మినుములో బూడిద తెగులు, వరిలో కాండం తొలిచే పురుగు, మిరప పంటలో తామర పురుగులను (Thrips) గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. తాము సిఫార్సు చేసిన లేబుల్ మందులను తగిన మోతాదులో పిచికారీ చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ క్షేత్ర సందర్శనలో ఏఈవో సాయిరాం, రైతులు పాల్గొన్నారు.