ఉచిత డయాలసిస్ సేవలు
సాయి రోహిత్ ఇంచార్జి
మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల ఉచిత డయాలసిస్ సేవలు
మేడ్చల్ అర్బన్ నవంబర్ 6(విజయక్రాతి): మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో(Medchal Government Hospital) 24 గంటల ఉచిత డయాలసిస్ సేవలను(Free dialysis services) అందించడం జరుగుతుందని డయాలసిస్ ఇంచార్జి సాయి రోహిత్(Dialysis In-charge Sai Rohit) పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ ఉచిత డయాలసిస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు గత సంవత్సరం నుండే కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం ఉచ్చ డయాలసిస్ యూనిట్ ను ప్రారంభించి నిరంతర సేవలను అందిస్తున్నామని రోహిత్ వెల్లడించారు.
ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్య సేవల తో మరింత ప్రయోజనం చేకూరాలని అర్హులైన రోగులందరికీ దీనితో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఎలాంటి సేవలను అందిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.అంతేకాకుండా బయట సుమారు 1000 రూపాయల విలువ చేసే బ్లడ్ ఇంజెక్షన్ తో పాటు ఐరన్ ఇంజెక్షన్ లను కూడా ఆసుపత్రిలోనే ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన చెప్పారు.