బతుకమ్మ, దసరా ఉత్సవాలలో మహిళల కోసం పలు వినోదాత్మక ఆటలు పోటీలు

13-10-2026 | 10:26pm

ఘట్ కేసర్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): జన చైతన్య సేవా సమితి(Janachaitanya Seva Samithi) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు, దసరా ఉత్సవాల సందర్భంగా మహిళల కోసం ప్రత్యేకంగా పలు వినోదాత్మక ఆటలు పోటీలు నిర్వహిస్తున్నట్లు మాజీ సర్పంచ్, జన చైతన్య సేవా సమితి వ్యవస్థాపకులు అబ్బసాని యాదగిరియాదవ్ తెలిపారు.

ఘట్ కేసర్ పట్టణంలోని గురుకుల్ కళాశాల గ్రౌండ్ నందు ఈనెల తేదీ 14 వరకు సాయంత్రం 4 గంటలకు నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే 15న (గురువారం) సాయంత్రం 7 గంటలకు దంతాల అనిల్ ఆధ్వర్యంలో నాట్య కళా క్షేత్రం కూచిపూడి డాన్స్ కార్యక్రమం, 16న (శుక్రవారం) సద్దుల బతుకమ్మ, 17న సాయంత్రం 5 గంటలకి ముగ్గుల పోటీలు, 18న దండియా కార్యక్రమం, 20న దసరా పండగ జమ్మి చెట్టు పూజ, అలాయి, బలాయి  కార్యక్రమాలు జనచైతన్య సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిచటం జరుగుతుందన్నారు.

మరిన్ని వార్తలు