పోలీస్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ఆసిఫాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం బతుకమ్మ సంబరాల(Bathukamma Celebrations)ను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జిల్లా ఎస్పీ నితికా పంత్, జిల్లా కలెక్టర్ హరిత, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శారదాదేవి, జేఎఫ్‌సీఎం అనంతలక్ష్మి, డీఎఫ్‌ఓ బాలామణి,మహిళా పోలీసు అధికారులు, సిబ్బంది సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ పాటలు పాడుతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే తెలంగాణ సంస్కృతి, ఆడబిడ్డల ఆత్మీయత, ఐక్యత ఈ వేడుకల్లో ప్రతిబింబించాయి.