బొల్లం కృష్ణ మృతికి కారణమైన...రాంకీపై చర్యలు తీసుకోవాలి
- తక్షణమే బాధిత కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్.
- అంబేద్కర్ చౌరస్తాలో ప్రజాసంఘాల నాయకుల నిరసన.
జవహర్ నగర్ సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): డంపింగ్ దుర్వాసనతోనే శ్వాసకోస సమస్యలతో అనారోగ్యానికి గురై మరణించిన బొల్లం కృష్ణ మృతి ముమ్మాటికి రామ్కీ యాజమాన్యం పరోక్షంగా చేసిన హత్యనేనని ప్రజాసంఘాల నాయకులు(Leaders of public associations) ఆరోపించారు. శ్వాసకోస అవస్థతో చికిత్స పొందుతూ గాంధీ దావఖానాలో మృతి చెందిన బొల్లం కృష్ణ మరణాన్ని నిరసిస్తూ రాంకీ యాజమాన్యంపై హత్యా నేరం కేసు నమోదు చేయాలని కోరుతూ నందమూరి నగర్ లో వైయస్సార్ విగ్రహం ఎదుట శుక్రవారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామికంగా లాభాపేక్షతో వ్యాపారాలు చేస్తూ ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న రాంకీ యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేసి బొల్లం కృష్ణ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆల్వాల్ సర్కిల్ ప్రాంతం చెత్తని తీసుకురాకుండా చూస్తామని చెప్పిన రాంకి నేడు మహానగరంలోని చెత్తనంతా ఇక్కడికి తీసుకువస్తూ డంపింగ్ ప్రాంతమంతా విష వాయువులతో నింపివేస్తూ జవహర్ నగర్ ప్రాంతాన్ని విజృంభిస్తుందన్నారు. 15 ఏళ్లుగా శ్వాస కోశ చర్మ గర్భస్రావ వ్యాధులతో మద్యంతరంగా ప్రజలు ప్రాణాలు వదిలిన వారికి రాంకీ యాజమాన్యమే బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు.
ఇప్పటికైనా ప్రజల ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం డంపింగ్ సమస్యను పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. గోల్కొండ కోటలా డంపింగ్ యార్డు మారిందని, ఇకనైనా నలువైపులా చెత్తను తరలించి జవహర్ నగర్ ను స్వేచ్ఛాయుతంగా తీర్చిదిద్దాలని తెలిపారు. బొల్లం కృష్ణ (31) పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కృష్ణ కుటుంబాన్ని రాంకీ యాజమాన్యం, ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టు షేక్షావలి, సుబ్రహ్మణ్యం, శివ బాబు, సదానందం, వేణు, మల్లేష్, సునీత, సావిత్రి, ప్రవీణ్, జావిద్, యాదగిరి, శారద, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.