రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యం

06-11-2026 | 09:49pm

చెరుకు శ్రీనివాస్ రెడ్డి 

చేగుంట నవంబర్ 06 : చేగుంట మండలం(Chegunta Mandal) రెడ్డిపల్లి గ్రామంలో పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని(Grain purchasing center) దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి(Cheruku Srinivas Reddy)  ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల సంక్షేమం(Welfare of Farmers),వ్యవసాయ రంగ అభివృద్ధికే కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్య మిస్తోందని  దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర అందేలా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు.

ధాన్యం తూకం,నాణ్యత పరిశీలన, కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. వరి కోతలు పూర్తయిన వెంటనే రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలని సిబ్బందికి సూచించారు..

ఈ కార్యక్రమంలో చెగుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తాడేం వెంగళరావు, చేగుంట మండల అధ్యక్షుడు కాశబోయిన భాస్కర్, పిఏసిఎస్ చైర్మన్ మేకల పరమేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మహమ్మద్ ముజామిల్, అన్నం ఆంజనేయులు, బాల్ రెడ్డి, రెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ చిన్న శెన్న నరసింహ, చేగుంట గ్రామ సర్పంచ్ సండ్రుగూ స్రవంతి సతీష్, ఉపసర్పంచ్ మహ్మద్ రఫీ, వివిధ గ్రామాల సర్పంచ్ లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు..

మరిన్ని వార్తలు