రాష్ట్రస్థాయి ఎస్జిఎఫ్ కుస్తీ పోటీల్లో మండల విద్యార్థి ప్రతిభ
సిల్వర్ మెడల్ సాధించిన రెబ్బనపల్లి విద్యార్థి...
దండేపల్లి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల విద్యార్థి ఈ నెల 11 నుంచి 13 వరకు నారాయణపేట జిల్లా కానుకుర్తి గ్రామంలో జరిగిన రాష్ట్రస్థాయి SGF పోటీల్లో ప్రతిభ కనబర్చి సిల్వర్ మెడల్ సాధించినట్లు మంచిర్యాల జిల్లా ఎస్జిఎఫ్ కార్యదర్శి యండీ యాకూబ్(SGF Secretary Y.D. Yaqoob) తెలిపారు. SGF అండర్ 14 కుస్తీ పోటీలలో మండలంలోని రెబ్బెనపల్లి ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న జే రామ్ చరణ్ అత్యంత ప్రతిభ కనబరిచి సిల్వర్ మెడల్ సాధించాడన్నారు.
రామ్ చరణ్ ను మండల విద్యాధికారి మంత్రి రాజు, పాఠశాల వ్యాయమ ఉపాధ్యాయుడు గాజుల శ్రీనివాస్, రెబ్బెనపల్లి గ్రామ సర్పంచ్ కందుల కల్యాణి అశోక్, ఉప సర్పంచ్ వినోద్, ఎల్లారం గ్రామ సర్పంచ్ గోడిసెల రాజేష్, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం నాయకులు కె రామ్మోహన్ రావు, సిరంగి గోపాల్, బండి రవి, సుర సుదర్శన్, సాంబమూర్తి, విఠ్ఠల్, కె జ్యోతి, ఏ వరలక్ష్మి, చాంద్ పాషా, ఉపాధ్యాయ బృందంలు అభినందనలు తెలిపారు.