గుంట్లపేటలో భూ రీసర్వే పరిశీలన
13-10-2026 | 10:32pm
పెంచికల్‌పేట్ (విజయక్రాంతి): కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రీహర్ష చౌదరి(Sub-Collector Sriharsha Chowdary) గుంట్లపేట గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ భూ రీసర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం పెంచికల్‌పేట్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. యెల్కపల్లి గ్రామంలోని ఇసుక రీచ్‌ను కూడా పరిశీలించారు. అక్రమంగా ఇసుకను తరలించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.