కూలిపోయే ప్రమాదంలో ఉన్న ఇంటిని పరిశీలించిన
ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ హామీ
సర్పంచ్ రాఘవులు
సింగరేణి సెప్టెంబర్ 25 (విజయ క్రాంతి) : సింగరేణి మండలం(Singareni Mandal) గుట్ట కింద గుంపు గ్రామపంచాయతీ(Gram Panchayat) పరిధిలోగల గాజుల తండ గ్రామానికి చెందిన పఠాన్ యాకూబ్ ఖాన్(Pathan Yaqub Khan) ఇల్లు భారీ వర్షాలతో(Heavy rains) దెబ్బతిని ప్రమాదకరంగా మారిన ఇంటిని గుట్టకింద గుంపు సర్పంచ్ రాఘవులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షబ్బీర్, ఉపసర్పంచ్ పర్వీన్ ఖాసీం లు పరిశీలించారు. ఇంటి పరిస్థితిని పూర్తిస్థాయిలో పరిశీలించి బాధిత కుటుంబంతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఈ విషయాన్ని శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ దృష్టికి తీసుకెళ్లగా బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలపగా సర్పంచ్ రాఘవులు హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందేలా కృషి చేస్తామని వారు తెలిపారు.