నీటి వాడకంపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి

06-11-2026 | 07:42pm

కొత్తపల్లి, నవంబర్ 06(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలో నీటి(Water) విషయంలో ఆందోళనకర పరిస్థితులు రాకముందే మున్సిపల్ అధికారులు(Municipal officials) ప్రజలను అప్రమత్తం చేయాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు(CPI District Council Member Paidipalli Raju) ప్రకటనలో కోరారు. కరీంనగర్ నగరం గణనీయంగా విస్తరించి అనూహ్య మార్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో ఎల్ఈఓ ప్రభావం అధికమవుతున్న తరుణంలో మంచినీటి కష్టాలు రాకముందే ప్రజలను మంచినీటి వాడకంపై అవగాహన కార్యక్రమాలు మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసి ప్రజల్ని చైతన్య పరచాలని పైడిపల్లి రాజు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు