పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
ఐదుగురు పేకాటరాయుళ్లు అరెస్ట్
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలోని పాత అంగన్ వాడి భవనంలోని వరండాలో శుక్రవారం సాయంత్రం ఐదుగురు వ్యక్తులు డబ్బులు పెట్టి పేకాట(Gamblers) ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు బాన్సువాడ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న వడ్ల లక్ష్మణ్, గడ్డం శేఖర్ గౌడ్, టేకుల గంగారాం, దేగాం అశోక్, మన్నె సాయిలు అనే ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుండి పేకాటకు సంబంధించిన నగదు రూ.1,200/-, 3 సెల్‌ఫోన్లు, 3 మోటార్ సైకిళ్లు,1 సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై బాన్సువాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టడం జరిగింది.ప్రజలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండాలని, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని బాన్సువాడ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడును. సెల్ 8712686167 సంప్రదించగలరు.