పూర్వికులు అందించిన సాంప్రదాయాన్ని భావితరాలకు అందించాలి

06-11-2026 | 10:37pm

కుమ్మరికుంట దండారి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఉట్నూర్,(విజయక్రాంతి): వందల ఏళ్ల క్రితం నుండి  ఆదివాసి గోండు, కొలం గిరిజన పూర్వికులు సంపదగా అందించిన  సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను భావితరాల వారికి  అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) అన్నారు. శుక్రవారం రాత్రి ఉట్నూర్ మండలం కుమ్మరికుంట గ్రామంలో నిర్వహించిన దండారి ఉత్సవాల్లో(Dandari Festival) నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్  పాల్గొని స్థానికులతో కలిసి సంప్రదాయ నృత్యం చేశారు. ఆదివాసీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే దండారి ఉత్సవాల్లో గ్రామస్థులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. ఆదివాసీ సంస్కృతి(Adivasi Culture), సంప్రదాయాలు మన పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న గొప్ప సంపద అని అన్నారు. దండారి వంటి సంప్రదాయ ఉత్సవాలు ఆదివాసీల ఐక్యతకు, సంస్కృతి పరిరక్షణకు ప్రతీకలని పేర్కొన్నారు. ఇలాంటి సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆదివాసీ నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు