పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు పొడిగింపు

06-11-2026 | 10:39pm

మిడ్జిల్: మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ జిల్లాల పట్టభద్రులకు(Graduates) ముఖ్య గమనిక అర్హులైన పట్టభద్రులు డిసెంబర్ 31 వరకు ఎమ్మెల్సీ ఓటరు(MLC Voter)గా తమ పేర్లను నమోదు చేసుకోవాలని మిడ్జిల్ మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మల్లేష్(Midjil BRS leader Mallesh) తెలిపారు.

గతంలో ఓటు వేసిన వారు కూడా గమనించాలి. గతంలో ఓటు హక్కు వినియోగించుకున్న వారు సైతం ప్రస్తుత ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించుకోవాలి. అవసరమైతే ఫారం-18 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, తోటి పట్టభద్రులకు ఈ సమాచారాన్ని తెలియజేయండి. ప్రతి ఓటు అమూల్యం – అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోండి!

మరిన్ని వార్తలు