తుఫాన్ బాధితురాలికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు
ములకలపల్లి,నవంబర్ 6 (విజయక్రాంతి): ములకలపల్లి మండలం(Mulakalapalli Mandal) జగన్నాధపురం గ్రామానికి చెందిన అనుపోంజు వరలక్ష్మి నివాస గృహం ఇటీవల వచ్చిన తుఫాన్ ప్రభావంతో(Impact of the cyclone) పూర్తిగా కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ(Ashwaraopeta MLA Jare Adinarayana) శుక్రవారం బాధితురాలి ఇంటిని సందర్శించి ఆమెను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితురాలికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు(Sanction of an 'Indiramma' house) చేస్తున్నట్లు ప్రకటించారు.
అదేవిధంగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు స్థానిక సర్పంచ్ కుంజా వినోద్, ఆర్.ఐ.సోయం రాంబాబు బాధిత కుటుంబానికి బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు రామచారి,కాంగ్రెస్ నాయకులు కొవ్వాకులగిరి,జానీ,జేపీవో నవీన్ పంచాయతీ సెక్రెటరీ సునేష్, తదితరులు,గ్రామస్థులు పాల్గొన్నారు.