స్పెషల్ బ్రాంచ్ కార్యాలయం ఆకస్మికంగా తనిఖీ

10-11-2026 | 08:37pm

పనితీరుపై అధికారులతో సమగ్ర సమీక్ష

కరీంనగర్ క్రైం, నవంబర్ 10 (విజయక్రాంతి): ​వెరిఫికేషన్ ప్రక్రియలో(Verification process) జాప్యం లేకుండా వేగవంతం చేయాలని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం(Karimnagar CP Ghouse Alam) స్పెషల్ బ్రాంచ్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ కమిషనరేట్(Karimnagar Commissionerate) లోని ​స్పెషల్ బ్రాంచ్  కార్యాలయాన్ని మంగళవారం పోలీస్ కమిషనర్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి, వివిధ విభాగాలను పర్యవేక్షించే అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.

​ఈ సమీక్షలో భాగంగా ప్రధానంగా పాస్‌పోర్ట్ వెరిఫికేషన్, ఉద్యోగ  ధ్రువీకరణ, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ల  జారీ ప్రక్రియపై ఆరా తీశారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, నిర్దేశిత గడువులోగా నిక్కచ్చిగా వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసి ధ్రువపత్రాలు జారీ చేయాలని స్పష్టం చేశారు. అలాగే సోషల్ మీడియా విభాగం పనితీరు, ఫీల్డ్ అధికారుల కార్యాచరణపై సమీక్షించి, క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ సమాచార సేకరణను వేగవంతం చేయాలని  దిశానిర్దేశం చేశారు.

​కార్యాలయ సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులపై సత్వరమే స్పందించాలని పలు కీలక సూచనలు జారీ చేశారు.


​ఈ తనిఖీ సమీక్షా సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్ అనిల్, డి.ఎ.వొ. విరాజ్ తో పాటు ఎస్సైలు, ఇతర పోలీసు అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు